Vegetables Price Hike in Telangana : ఇటీవల కాలంలో టమాట ధరలకు జనం బెంబేలెత్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టమాట ధర కిలో రూ.200 వరకు చేరింది. సామాన్యుడికి వాటిని కొనలేని దుస్థితి ఎదురైంది. వంటల్లో సర్వాంతర్యామిగా చెప్పుకునే టమాట(Tomato Price)ను వేయకుండానే కూరలొండే పరిస్థితులొచ్చాయి. ఇదొక్కటే కాదు.. పచ్చి మిర్చి(Chilli Price), క్యాప్సికం, బీరకాయ, బెండకాయ, చిక్కుడు, బీన్స్, వంకాయ తదితర కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పచ్చి మిర్చి ధర కూడా కిలో రూ.150 వరకు చేరిన సందర్భం ఉంది.
ఇకపోతే ఇవే కూరగాయలకు సరైన ధర లభించని సందర్భాలూ ఉంటాయి. ధరలు పెరుగుతున్నాయని ఆశించిన రైతులకు అవి చేతికందే సమయానికి ధరలు అమాంతం పడిపోతాయి. దీంతో ఆ పంట పెట్టుబడి కూడా రాక చెత్తకుప్పల్లో పడేసిన పరిస్థితులు ఉంటాయి. ఈ హెచ్చుతగ్గులతో ధరలు పెరిగినప్పుడు సామాన్యుడు.. తగ్గినప్పుడు రైతు నష్టపోతున్నారు.
Tomato Prices More High : టమాట రికార్డుల మీద రికార్డులు.. భైంసాలో కిలో@200
Ways to Lower Vegetables Price : సాధారణంగా ధరల హెచ్చుతగ్గుదల పంట విస్తీర్ణం.. వాతావరణ అనుకూలతపైన ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో టమాట ధరలు పెరగడానికి పంట విస్తీర్ణం తగ్గడం ఒక కారణమైతే.. అకాల వర్షాలతో పంటలు దెబ్బ తినడం, దీంతో డిమాండ్‌కు తగిన సప్లై ఉండకపోవడం మరో కారణం. దళారీల నిర్వాకాలు ఇంకో కారణం. దేశంలో ప్రతి సీజన్‌లో ఏదొక రకమైన కూరగాయల ధరలు పెరగడం, తగ్గడం సర్వ సాధారణం. కానీ.. ఈ పరిస్థితులు ఎందుకొస్తున్నాయనేదే అసలు ప్రశ్న.
కూరగాయల ధరలు(Vegetable Prices Today) ఏటా ఓ సమయానికి పెరగడం సాధారణం అని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. మరిన్ని రోజుల్లో ధరలు తగ్గుతాయని కూడా అంటారు. కానీ, ధరల వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం పట్టించుకోరు. హెచ్చుతగ్గులపై ముందే అవగాహన ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ విషయాన్ని ముందే పసిగట్టి ధరలు పెరగకుండా జాగ్రత్త పడితే సామాన్యుడి జేబు చిల్లుకాకుండా చూడొచ్చు. ఏఏ కూరగాయల అవసరం ఏ మేరకు ఉందో తెలుసుకొని.. వాటిని పండించే రైతులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. వరి, గోధుమ మాదిరిగా కూరగాయలను నిత్యాహార పంటలుగా పరిగణించి ప్రాధాన్యం కల్పించి రైతులతో సాగు చేయించాలి.
Tomato Price Record: ఆపిల్ దిగదుడుపే..! హోల్‌సేల్ మార్కెట్‌లో ఆల్‌టైమ్ హిట్ కొట్టేసిన టమాటా ధర
Vegetables Price Hike in India : దేశంలో పండుతున్న కూరగాయల్లో ఉల్లి, ఆలుగడ్డ, టమాటాలే 52 శాతానికి పైగా ఉంటున్నాయి. మిగిలిన అన్ని రకాల కూరగాయల్లోనూ బెండ, వంకాయ, క్యాబేజీలే అధికమని తెలుస్తోంది. పోషకాలను అందించే బీన్స్, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయల దిగుబడులతో పాటు సాగు విస్తీర్ణం సైతం తక్కువ ఉండటం వల్ల ఏడాది పొడవునా వాటి ధరలు అధికంగానే ఉంటున్నాయి. కూరగాయలను తోటలో కోసి.. ప్రజల వినియోగంలోకి తెచ్చేలోగా 30 శాతం చెడిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు.
Tomato Price Today in Telangana : త్వరగా పాడవుతున్నందు వల్ల వాటి నిల్వకు అధునాతన శీతల గిడ్డంగులు అవసరం. అయితే భారత్‌లోని శీతల గిడ్డంగుల్లో 59 శాతం ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిని అత్యధికంగా ఆలుగడ్డల నిల్వకు వాడుతున్నారు. త్వరగా పాడయ్యే టమాట వంటి వాటికి చాలా రాష్ట్రాల్లో నిల్వ సదుపాయాలే లేవు. ఈ కారణాలన్నింటి వల్ల ధరలు ఒక్కో కాలంలో ఒక్కోలా ఉంటున్నాయి. వీటన్నింటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ధరల వ్యత్యాసాల్లో మార్పులు చోటుచేసుకోవని నిపుణులు చెబుతున్నారు.
Tomato Farmer Millionaire : ఎకరంలో టమాటా సాగు.. మూడు నెలల్లోనే లక్షాధికారిగా మారిన రైతు
ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వాలు.. ప్రజల సమస్యలను ముందుగానే పసిగట్టాలి. కానీ, కూరగాయల ధరల విషయంలో ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా ఒక్కో సమయంలో ధరలు పెరుగుతాయని తెలిసి కూడా తగ్గించేందుకు కృషి చేయకపోవడంతో అది సామాన్యులకు భారంగా మారుతోంది. సమస్య ఉత్పన్నం అవుతుందని ముందే తెలిసినా.. దాని పరిష్కారానికి కృషి చేయకపోవడం ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా కనిపిస్తోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ధరల వ్యత్యాసాలు రాకుండా కృషి చేస్తే అది జనజీవనానికి ఎంతగానో ఉపయోగపడనుంది.
Tomato record Prices: మోత మోగిస్తున్న టమోటా.. కిలో రూ150! కొనేందుకు జంకుతున్న ప్రజలు
Chintapandu Price Hike : సామాన్యుడికి మరో ఝలక్.. టమాటాను మించి చింతపండు ధరలు