ETV Bharat / state

గిట్టుబాటు ధర లేక.. ధరలు నేలచూపులు

కూరగాయలు, పూల ధరలు అన్నదాతకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే... గిట్టుబాటు ధర కాదు కదా... కనీసం రవాణా ఛార్జీలకు కూడా సరిపోవట్లేదు. రాష్ట్ర పరిస్థితులకు తోడు పొరుగు రాష్ట్రాల నుంచి సరకు పోటెత్తుతుండటంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

Vegetables and flowers market dull in hyderabad
గిట్టుబాటు ధర లేక.. ధరలు నేలచూపులు
author img

By

Published : Apr 3, 2021, 12:52 PM IST

గిట్టుబాటు ధర లేక.. ధరలు నేలచూపులు

మద్దతు ధర రాక కూరగాయలు, పూల రైతులు దిగాలు పడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే... కూలీ, రవాణా ఖర్చులూ రావడం లేదని వాపోతున్నారు. 25 కిలోల టమాటా బాక్సు ధర 100 నుంచి 150 రూపాయలకు మాత్రమే అమ్ముడవుతోంది. అదే చిల్లర మార్కెట్‌లో కిలో టమాట ధర 20 రూపాయల వరకు పలుకుతోంది. మధ్య దళారులు, వ్యాపారులకే అధిక లాభాలు వెళ్తున్నాయి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి లాంటి మార్కెట్లకు నిత్యం 250 నుంచి 300 వాహనాల్లో కూరగాయలు వస్తుంటాయి. అన్నింటి ధరలూ నేల చూపూలు చేస్తున్నాయి. రైతులకు దక్కేది తక్కువ ఉంటే... ప్రజలకు మాత్రం అంతంత ధరలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటి పండిస్తే కనీస ధరలు లేక తీవ్ర నష్టాలు వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ధరలు నేల చూపులు

కరోనాతో అన్ని రంగాల మాదిరే రైతులూ కుదేలయ్యారు. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో... పాఠశాలలు, వసతి గృహాలు, శుభకార్యాలు లేకపోవడంతో... కూరగాయల ధరలు పడిపోయాయి. ప్రస్తుతం శుభకార్యాలు జరుగుతున్నా... మిగతా అన్ని బంద్‌ ఉండటంతో... డిమాండ్‌ పడిపోయింది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి వనరులు పెరిగాయి. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయడంతో దిగుబడి పెరిగింది. కానీ అందుకు తగ్గట్లుగా మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడంతో ధరలు నేల చూపులు చూస్తున్నాయని చెబుతున్నారు.

అన్నదాతల దిగాలు

పూలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితీ దయనీయంగా మారింది. పండుగలు పబ్బాలు, వివాహాది శుభకార్యాలు తగ్గడంతో... పూలకు గిరాకీ లేదు. చేతికొచ్చిన పంటను కోసి మార్కెట్లకు తీసుకొస్తే... మద్దతు ధరలు అందడంలేదు. కూలీల ఖర్చులు, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటడంతో... సరకు రవాణా ఖర్చులు పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి మన మార్కెట్లకు సరకు పోటెత్తడంతో... ధరలు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అది కట్టడి చేస్తే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు.

ధర దక్కేలా చర్యలు

రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి... మన పంటను వేరే ప్రాంతాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ఇదీ చూడండి: బతుకు భారమై.. రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.