ETV Bharat / state

సామాన్యుడికి  కూర "గాయాలు" - పెరిగిన కూరగాయల ధరలు

టమాట మోత మోగుతోంది. వారం రోజుల కిందట టమాట కిలో ధర రూ.10 ఉండగా... ఇప్పుడు రూ.42 పలుకుతోంది. ఇతర కూరగాయల ధరలకు కూడా సెగ తగలడం వల్ల వినియోగదారులకు భారంగా మారింది.

పెరిగిన కూరగాయల ధరలు
author img

By

Published : Oct 2, 2019, 5:51 AM IST

Updated : Oct 2, 2019, 8:04 AM IST

పెరిగిన కూరగాయల ధరలు

రాష్ట్రంలో కూరగాయల ధరల మంట మొదలైంది. ఉల్లిగడ్డలతో అంటుకున్న సెగ... టమాటాలు, ఇతర కూరగాయలకూ పాకింది. మంగళవారం హైదరాబాద్ బోయినపల్లి టోకు మార్కెట్‌లోనే కిలో టమాటాల టోకు ధర రూ.42కు చేరుకుంది. సరిగ్గా వారం క్రితం కిలో టమాటా ధర రూ.10 లోపే ఉండటం గమనార్హం. గత కొద్దిరోజులుగా తరచూ కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయలు, ఆకుకూరల తోటలు చాలా వరకు దెబ్బతినడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న కూరగాయలే జంట నగరాల మార్కెట్లకు ఆధారంగా మారాయి.

ఇతర రాష్ట్రాల నుంచి అధికం..

బోయినపల్లి, గుడిమల్కాపూర్ టోకు మార్కెట్లకు మునగకాయలు అన్నీ చెన్నై నుంచి వచ్చాయి. దొండ, బోడ కాకరకాయలు కోల్​కతా నుంచి వస్తున్నాయి. సొరకాయలు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌, కోలార్, మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. టమాలు బోయినపల్లి మార్కెట్‌కు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వర్షాలకు పంటలు పాడవటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున కూరగాయలు తెప్పిస్తున్నారు.

వామ్మో కిరాయిలు..

మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి లారీ కిరాయికి రూ.10 వేలకు పైగా వెచ్చించి తేవడం వల్ల ఇక్కడ చిల్లర ధర రూ.50కి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. రవాణాలో 20 నుంచి 30 శాతం దాకా కూరగాయలు పాడవుతున్నట్లు తెలిపారు. పాడైన పంట నష్టం రాబట్టుకునేందుకు స్థానికంగా ధర పెంచి విక్రయించాల్సి వస్తోందంటున్నారు. మార్కెట్‌లో ధర పెరుగుతున్న సమయంలో తెలంగాణ రైతులు తీసుకురావడం తగ్గిస్తున్నారు. ధర బాగా పెరిగిన తర్వాత తెస్తే లాభాలు వస్తాయని కూడా కొందరు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

వర్షాలు ఆగితే అదుపులోకి..

వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి అన్నారు. పూత, కాత రావడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు ఆగినందున మరో వారం రోజుల్లో మళ్లీ దిగుబడి పెరిగి ధరలు అమాంతం తగ్గే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వర్షాలకు మచ్చలు పడి కూరగాయల నాణ్యత బాగా తగ్గిపోయిందని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మహర్ష తెలిపారు. వర్షాలు ఆగితే ధరలు అదుపులోకి వస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండిః ఒడిశా 'హుమ్మా'తో మహాత్ముడికి ప్రత్యేక అనుబంధం

Last Updated : Oct 2, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.