ETV Bharat / state

Vegetable Price Hike in Telangana : సామాన్యుడిని బెంబేలెత్తిస్తోన్న కూరగాయల ధరలు.. ప్రభుత్వాలు ఏం చేయాలి?

Vegetable Price Hike in Telangana : కూరగాయల ధరలు కొండెక్కాయి. కొనలేం.. తినలేం. సెంచరీ ధాటిన టమోటో ధర. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి. వంటిట్లోకి వెళ్లాలంటే సామాన్యుడికి భయమేస్తోంది. మరోవైపు అమాంతం తగ్గిన కూరగాయల ధరలు. మార్కెట్‌లో ఓ సమయంలో కూరగాయల ధరలు అమాంతం పెరుగుతాయి. మళ్లీ కొద్ది రోజులకు వాటంతటవే తగ్గుముఖం పడతాయి. మరోవైపు ఒక రకం కూరగాయలు ధరలు తగ్గితే.. మరోరకం కూరగాయల ధరలు పెరుగుతూ పోతాయి. వాటిని చూస్తూ బాబోయ్‌ ఏమిటీ ధరలు అనుకోవడమే తప్ప.. ఎప్పుడైనా ధరల హెచ్చుతగ్గుదలకు కారణాలేంటని ఆలోచించారా? ప్రజల కోసమే పనిచేస్తామంటూ చెప్పే ప్రభుత్వాలు ఈ ధరల్ని ఎందుకు నియంత్రించలేక పోతున్నాయి.? ధరాఘాతాలతో సామాన్యుడు ఎప్పటికీ బలి కావాల్సిందేనా.?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 9, 2023, 9:43 PM IST

Vegetable Prices పెరుగుతున్న కూరగాయల ధరలు

Vegetable Price Hike in Telangana : ఇటీవల కాలంలో టమాట ధరలకు జనం బెంబేలెత్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టొమాటో ధర కిలో రూ.200 వరకు చేరింది. వాటిని కొనలేని దుస్థితి సామాన్యూడికి ఎదురైంది. వంటల్లో సర్వాంతర్యామిగా చెప్పుకునే టొమోటోను వేయకుండానే కూరలొండే పరిస్థితులొచ్చాయి. ఇదొక్కటే కాదు.. పచ్చిమిర్చి, క్యాప్సికం, బీరకాయ, బెండకాయ, చిక్కుడు, బీన్స్‌, వంకాయ తదితర కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పచ్చిమిర్చి ధర కూడా కిలో రూ.150 వరకు చేరిన సందర్భం ఉంది. ఇకపోతే ఇవే కూరగాయలకు సరైన ధర లభించని సందర్భాలు కూడా ఉంటాయి. ధరలు పెరుగుతున్నాయని ఆశించిన రైతులు అవి చేతికందే సమయానికి ధరలు అమాంతం పడిపోతాయి. దీంతో ఆ పంట పెట్టుబడి కూడా రాక చెత్తకుప్పల్లో పడేసిన పరిస్థితులు ఉంటాయి. ఈ హెచ్చుతగ్గులతో సామాన్యుడు ధరలు పెరిగినప్పుడు కొనలేడు.. తగ్గినప్పుడు రైతు లాభపడలేడు.

Reason of Vegetable Prices Increase : సాధారణంగా ధరల హెచ్చుతగ్గుదల పంట విస్తీర్ణం, వాతావరణ అనుకూలత పైన ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో టమోటో ధరలు పెరగడానికి పంట విస్తీర్ణం తగ్గడం ఒక కారణమైతే.. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం, దీంతో డిమాండ్‌కు తగిన సప్లై ఉండకపోవడం మరో కారణం. దళారీల నిర్వాకాలు ఇంకోకారణం. దేశంలో ప్రతి సీజన్‌లో ఏదొక రకమైన కూరగాయల ధరలు పెరగడం, తగ్గడం సర్వసాధారణం. కానీ, ఈ పరిస్థితులు ఎందుకొస్తున్నాయనేదే అసలు ప్రశ్న. మరోవైపు ఉల్లి ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ సెప్టెంబరు కల్లా కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరగొచ్చని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌’పేర్కొంది. అక్టోబరు నుంచి ఖరీఫ్‌ పంట లభ్యత పెరిగితే, ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని తన నివేదికలో పేర్కొంది. పండగల సీజను అక్టోబరు- డిసెంబరులో ధరలు స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికి కారణం కొన్నాళ్లుగా ధరలు తక్కువగా ఉండటంలో పంట విస్తీర్ణాన్ని రైతులు తగ్గించారని నిపుణులు చెబుతున్నారు.

Vegetable Cultivated crops will decrease : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణం అనుకూలించక పంటలపై తీవ్ర ప్రభావం పడింది. కూరగాయల సాగుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, ముందుచూపు కొరవడటం, రైతులకు తగిన ప్రోత్సాహం అందకపోవడం.. ఇవన్నీ ధరల మంటకు ఆజ్యం పోస్తున్నాయి. కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపులో కొన్నేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పండించే రైతులకు, ప్రభుత్వ యంత్రాగం మధ్య అంతులేని దూరం పెరిగింది. ప్రభుత్వాలు వరి, గోదుమ, పత్తి తదితరాలనే పంటలుగా భావిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఒక రాష్ట్రంలో పంటిన పంట ఇంకో రాష్ట్రానికి సరఫరా అవుతాయి. తెలగాణకు టమోటో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌, చింతామణి నుంచి వస్తుండగా మిర్చి కర్ణాటక రాష్ట్రంలోని బెల్‌గాం నుంచి వస్తోంది.

Tomato record Prices: మోత మోగిస్తున్న టమోటా.. కిలో రూ150! కొనేందుకు జంకుతున్న ప్రజలు

ఉల్లి, ఆలుగడ్డ, టొమాటోలే 52శాతానికి పైగా : ప్రపంచంలో కూరగాయలు, పండ్లు పండిస్తున్న రెండో అతిపెద్ద దేశం భారత్‌. 2021-22 సంవత్సరంలో దేశంలో 204 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కూరగాయలు సాగయ్యాయి. 11.35 మిలియన్ల హెక్టార్లలో వివిధ రకాల కూరగాయాలు సాగయ్యాయని.. అగ్రికల్చరల్ అండ్ ప్రోసెస్డ్‌ ఫుడ్ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ - అపెడా వెల్లడించింది. కూరగాయల ధరలు ఏటా ఓ సమయానికి పెరగడం సాధారణం అని ప్రభుత్వ పెద్దలు చెబుతారు. మరోవైపు మరిన్ని రోజుల్లో ధరలు తగ్గుతాయని కూడా అంటారు. కానీ, ధరల వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత పట్టించుకోరు. హెచ్చుతగ్గులపై ముందే అవగాహన ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ విషయాన్ని ముందే పసిగట్టి ధరలు పెరగకుండా జాగ్రత్త పడితే సామాన్యుడి జేబు చిల్లుకాకుండా చూడొచ్చు, ఏఏ కూరగాయల అవసరం ఏ మేరకు ఉందో తెలుసుకొని వాటని పండించే రైతులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. వరి, గోధుమ మాదిరిగా కూరగాయలను నిత్యాహార పంటలుగా పరిగణించి ప్రాధాన్యం కల్పించి రైతులతో సాగు చేయించాలి. దళారుల వ్యవస్థ లేకుండా రైతులే వ్యవసాయ మార్కెట్ల ద్వారా విక్రయించేలా కృషి చేయాలి. దేశంలో పండుతున్న కూరగాయల్లో ఉల్లి, ఆలుగడ్డ, టొమాటో(Tomato Price)లే 52శాతానికి పైగా ఉంటున్నాయి.

శీతల గిడ్డంగులు ఆలుగడ్డల నిల్వకే ఎక్కువగా వాడకం : మిగిలిన అన్ని రకాల కూర గాయల్లోనూ బెండ, వంకాయ, క్యాబేజీలే అధికమని తెలుస్తోంది. పోషకాలను అందించే బీన్స్‌, క్యారట్‌, బీట్‌రూట్‌ వంటి కూరగాయల దిగుబడులతో పాటు సాగు విస్తీర్ణం సైతం తక్కువ. అందువల్ల ఏడాది పొడవునా వాటి ధరలు అధికంగానే ఉంటున్నాయి. కూరగాయలను తోటలో కోసి ప్రజల వినియోగంలోకి తెచ్చేలోగా 30% చెడి పోతున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. త్వరగా పాడవుతున్నందువల్ల వాటి నిల్వకు అధునాతన శీతల గిడ్డంగులు అవసరం. భారత్‌లోని శీతల గిడ్డంగుల్లో 59% ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిని అత్యధికంగా ఆలుగడ్డల నిల్వకు వాడుతున్నారు. త్వరగా పాడయ్యే టొమాటో వంటి వాటికి చాలా రాష్ట్రాల్లో నిల్వ సదుపాయాలే లేవు. ఈ కారణాలన్నింటి వల్ల ధరలు ఒక్కో కాలంలో ఒక్కోలా ఉంటున్నాయి. వీటన్నింటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ధరల వ్యత్యాసాల్లో మార్పులు చోటుచేసుకోవని నిపుణులు చెబుతున్నారు.

Tomato Price Hyderabad Today : హమ్మయ్య.. దిగొచ్చావా టమాటా.. అయితే టేస్ట్ చేయాల్సిందే..!

Tomato Price Record: ఆపిల్ దిగదుడుపే..! హోల్​సేల్ మార్కెట్​లో ఆల్​టైమ్ హిట్ కొట్టేసిన టమాటా ధర

Tomato Prices More High : టమాట రికార్డుల మీద రికార్డులు.. భైంసాలో కిలో@200

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.