ETV Bharat / state

TPCC: గాంధీ భవన్​లో వాస్తు మార్పులు - గాంధీ భవన్​ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్​లో.. నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్​ పదవీ బాధ్యతలు తీసుకోకముందే గాంధీభవన్​లో.. వాస్తు నిపుణుల సూచనల మేరకు పలు మార్పులు చేర్పులు చేపట్టారు. రాకపోకలు సాగించే దారితో సహా పీసీసీ అధ్యక్షుడు కూర్చునే ఛాంబర్​ను మార్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

revanth reddy
గాంధీ భవన్​, రేవంత్​ రెడ్డి
author img

By

Published : Jul 3, 2021, 8:34 PM IST

వాస్తు నిపుణుల సూచనల మేరకు గాంధీభవన్​లో పలు మార్పులు చేర్పులు చేపట్టారు. టీపీసీసీ నాయకుడు వేణు ఆధ్వర్యంలో వాస్తు నిపుణులు.. గాంధీ భవన్​ను సందర్శించి లోపల, వెలుపల, పరిసరాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేయాలో సివిల్ కాంట్రాక్టర్​కు సూచించారు.

మొదటగా చిన్నచిన్న మరమ్మతులు

పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్​ను మార్చడం, ఇప్పుడు నడుస్తున్న దారి బదులు మరొక దారిని సూచించారు. రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సమయం కేవలం మూడు రోజులే ఉండటంతో సివిల్ పనులు జోలికి వెళ్లకూడదని నిర్ణయించారు. గాంధీ భవన్ లోపల, బయట అంత శుభ్రం చేయడం, దారికి అడ్డంగా ఉన్న గదులను కూల్చివేయడం, గాంధీ విగ్రహం వద్ద పాడైన ఫ్లోరింగ్ వేయడం, చెట్లను ట్రిమ్ చేయడం, భవంతికి రంగులు వేయడం లాంటి వాటితోపాటు చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేస్తారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం వరకు చేయగలిగినవి చేస్తారు. గాంధీ భవన్ లోపల అంతర్గతంగా చెయ్యాల్సిన మార్పులు, చేర్పులు బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడతారని రేవంత్ రెడ్డి తరఫున పనులను పర్యవేక్షణ చేస్తున్న టీపీసీసీ నాయకులు వేణు తెలిపారు.

సీనియర్లతో భేటీ

బాధ్యతలు స్వీకరించే ముందు రేవంత్​ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అవుతున్నారు. అసంతృప్తులను, సీనియర్లను కలుస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్​ను కలిసి ఆయన యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దామోదర రాజనరసింహను కలిశారు. రేణుక చౌదరితో భేటీ అయ్యారు. పొన్నం ప్రభాకర్​, ​షబ్బీర్​ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​ రెడ్డి, సంపత్​ కుమార్​, నాగం జనార్దన్​ రెడ్డి, కొండా సురేఖ ఏఐసీసీ సభ్యులు కుసమ కుమార్​ను కలిశారు.

ఇదీ చదవండి: Viral: అర్ధరాత్రి యువతీయువకులపై మూకదాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.