Vasireddy Krishnamurthy Died : విజయవాడలో ప్రముఖ పారిశ్రామికవేత్త వాసిరెడ్డి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ భవన సముదాయంలో కృష్ణమూర్తి పార్థివ దేహానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఘన నివాళి అర్పించారు. 1932లో జన్మించిన కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1960వ దశకంలో విజయవాడకు చలువ యంత్రాలను తీసుకొచ్చారు. యానాంలో చలువ యంత్రాల పరిశ్రమను స్థాపించారని కృష్ణమూర్తి కుమారుడు నాగార్జున చెప్పారు.
కమ్యూనిజం భావాలను అందిపుచ్చుకున్న కృష్ణమూర్తి.. నాస్తికుడిగానే జీవించారన్నారు. ఆయన చివరి కోరిక మేరకు కృష్ణమూర్తి పార్థివదేహాన్ని విజయవాడలోని సిద్ధార్థ ఆస్పత్రికి అందజేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: