ETV Bharat / state

'అర్హులందరికీ పదోన్నతులు.. వసంత్​ ఆరోపణల్లో నిజం లేదు' - hyderabad news today

గాంధీ ఆసుపత్రిలో వైద్యుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. డాక్టర్ వసంత్​ ఆరోపణలపై డీఎంఈ స్పందించారు. వసంత్​కు ఇది అలవాటేనని... రమేశ్‌రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.

Vasanth's allegations are not true gandhi hospital dme ramesh reddy
'అర్హులందరికీ పదోన్నతులు.. వసంత్​ ఆరోపణల్లో నిజం లేదు'
author img

By

Published : Feb 11, 2020, 2:55 PM IST

గాంధీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్​గా వసంత్​కు బెదిరింపులు అలవాటేనని డీఎంఈ రమేశ్‌రెడ్డి చెప్పారు. రెండ్రోజుల క్రితం సూపరింటెండెంట్ గదిలో కూడా ఇలానే హల్‌చల్ చేశాడన్నారు. ఆర్‌ఎంవోను వసంత్ దుర్భాషలాడారని తెలిపారు. అందుకే వసంత్‌పై చర్యలు తీసుకుని ఆరోగ్యశాఖకు సరెండర్ చేశామన్నారు. క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తప్పవని డీఎంఈ హెచ్చరించారు. గతంలో కూడా వసంత్​ పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

వైద్యుడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రోగులకు ఇబ్బందిగా ఉటుందని రమేశ్‌రెడ్డి అన్నారు. గతంలోనూ రెండుసార్లు కిరోసిన్ పోసుకుంటానని వసంత్​ బెదిరించాడని తెలిపారు. ఇప్పటివరకు అర్హులైన అందరికీ పదోన్నతులు ఇచ్చామని పేర్కొన్నారు. డీఎంఈ పరిధిలో పదోన్నతులకు అర్హులైన వైద్యులే లేరని చెప్పారు. సీసీఏ రూల్స్ ప్రకారం వైద్యుడు వసంత్‌పై చర్యలు తీసుకుంటారమని తెలిపారు.

'అర్హులందరికీ పదోన్నతులు.. వసంత్​ ఆరోపణల్లో నిజం లేదు'

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.