Variety Thiefs in Hyderabad : హైదరాబాద్‌లో ఏటా 8-9 వేలకు పైగా చోరీలు జరుగుతుంటాయి. వాటిలో అధికశాతం ఇళ్లలో చోరీలు నమోదవుతుంటాయి. ఒక్కసారి నగరానికి వచ్చి వెళ్తే బిందాస్‌గా బతికేయోచ్చనేది అంతర్రాష్ట్ర ముఠాల నమ్మకం. గృహాలు, బంగారు దుకాణాలు, కార్యాలయాల్లోకి చొరబడి దొంగలు చాకచక్యంగా పనిపూర్తి చేస్తారు. తీరా పోలీసులకు పట్టుబడ్డాక వారి వద్ద నుంచి నయా పైసా కూడా రికవరీ లేదు. వీరిలో కొందరి దానధర్మాలు గుర్తించి పోలీసులే అవాక్కవుతున్నారు.
రూ.4.75 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్- ఎలా చేశాడో తెలిస్తే షాక్ అవ్వక మానరు!
దోచిన సోమ్ములో పేద రైతుల బోర్లకు సాయం.. : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఘరానా దొంగ ఎల్లయ్య. రాత్రి మాత్రమే దొంగతనం చేస్తాడు. తాళం వేసిన ఇళ్లను జాగ్రత్తగా గమనిస్తాడు. అక్కడ సీసీ టీవీ కెమెరాలు, పోలీసు నిఘా లేవని నిర్ధారించుకున్నాక రంగంలోకి దిగుతాడు. విలువైన వస్తువులు చోరీ చేసి రెప్పపాటులో మాయమవుతాడు. సొత్తును రిసీవర్లకు అప్పగించి వచ్చిన సొమ్మును గ్రామాల్లో బోర్లు తీసేందుకు సిద్ధమైన పేద రైతులకు ఇస్తాడు.
పెద్దలను కొట్టి పేదలకు పంచుతూ..: బిహార్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అతనొక రాబిన్ హుడ్(Bihar Robinhood). పెద్దలను కొట్టి పేదలకు పంచుతాడు. చోరీలు చేసేందుకు ముందుగా ఆధునిక సాంకేతికత సాయం తీసుకుంటాడు. ఖరీదైన ప్రాంతాలపై కన్నేస్తాడు. సెల్‌ఫోన్, చెప్పులు ఉపయోగించడు. చోరీ సమయంలో సీసీ కెమెరాల కళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.
లేడీసే కదా అని లిఫ్ట్ ఇస్తున్నారా - ఇలాంటోళ్లు కూడా ఉంటారు, జర పైలం
దొంగతనానికి బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, పుణె, వంటి నగరాలు ఎంచుకుంటాడు. ఇళ్లలోకి చొరబడి బంగారం, నగదు మాత్రమే తీసుకుంటాడు. వెండి ఆభరణాల జోలికెళ్లడు. బంగారం విక్రయించి వచ్చిన సొమ్ములో 20-30శాతం వైద్యం, పేదల చదువు, వివాహం, రహదారుల నిర్మాణానికి ఇస్తాడు. మూత్రపిండాల జబ్బుతో బాధపడే రోగికి రూ.18లక్షలు సమకూర్చేందుకు నగరంలో చోరీలకు పాల్పడి జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కాడు.
చోరీ చేసి, వస్తువుల చీటీ రాసి.. : దొంగతనం చేశాక ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తూ వివిధ రకాల ప్రణాళికలు వేసుకుంటారు. ఇది అందరూ దొంగలు చేసే పనే. కానీ ఆ దొంగ మాత్రం వేరే లెవల్. ఎక్కడైనా చోరీ చేస్తే ఎంత నగదు దోచుకున్నాడో, ఎన్ని నగలు పట్టుకెళ్తున్నాడో తెలిసేలా పక్కగా చీటీ రాసి మరీ పెడుతాడు. ఆ వెరైటీ దొంగ రత్తావత్ శంకర్‌నాయక్. బీఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లొచ్చాక దొంగగా మారాడు. మిత్రుల కోసం ఎంతకైనా తెగిస్తాడు. వారికి డబ్బు అవసరమని తెలియగానే అప్పటికప్పుడే కాలనీల్లో రెక్కీ నిర్వహించి వస్తువులు కొట్టేస్తాడు. అక్కడ చోరీ చేసిన వస్తువుల వివరాలు చిట్టీ రాసి అక్కడే ఉంచుతాడు.
'ఐ'రేంజ్ మోసం - హోల్‌సేల్ ధరలో ఫోన్లు కావాలంటూ నట్టేట ముంచిన వ్యక్తి అరెస్టు