ETV Bharat / state

సంక్రాంతి కానుక.. 15న కూతపెట్టనున్న వందేభారత్​ రైలు - వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

vande bharat train
vande bharat train
author img

By

Published : Jan 11, 2023, 10:06 PM IST

Updated : Jan 11, 2023, 10:33 PM IST

22:03 January 11

సంక్రాంతి కానుక.. 15న కూతపెట్టనున్న వందేభారత్​ రైలు

Vande Bharat Train Inaguration Schedule : సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్‌ మారింది. ఈ నెల 19న సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందే భారత్‌ రైలును మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ, ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన వాయిదా పడటంతో రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్‌ కూడా మారింది. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

తొలి కూత అక్కడే.. ‘ట్రైన్‌-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ-వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 762 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ ఛైర్‌కార్ సీసీ క్లాస్‌ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్‌ 30న గాంధీనగర్‌ - ముంబయి వందేభారత్‌ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు.

తయారీ వేగానికి బ్రేకులు.. 2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ కొవిడ్‌ కారణంగా అది నెరవేరలేదు. 2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తయారు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ రైళ్ల కోసం కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్‌.. ఉక్రెయిన్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది.

దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్‌ రిపబ్లిక్‌, పోలండ్‌, మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని స్టీల్‌ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. దుర్గాపూర్‌ స్టీల్‌ప్లాంట్ యూనిట్‌లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.