ETV Bharat / state

మంచి మార్గంలో నడిచేవారు మహర్షులవుతారు: శ్రీనివాస్‌ గౌడ్‌ - వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని.. చెడును దరికిరానివ్వకుండా మంచి మార్గంలో నడిచేవారు మహర్షులవుతారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

మంచి  మార్గంలో నడిచేవారు మహర్షులవుతారు: శ్రీనివాస్‌ గౌడ్‌

author img

By

Published : Oct 31, 2020, 3:24 PM IST

హైదరాబాద్ రవీంద్రభారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ఆదికవి, మహర్షి, వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాల్మీకి చిత్ర పటానికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గౌడ్, వాల్మీకి కుల సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని.. చెడును దరికిరానివ్వకుండా మంచి మార్గంలో నడిచేవారు మహర్షులవుతారని మంత్రి పేర్కొన్నారు.

సమాఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన వైతాలికులను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా గుర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. అందులో భాగంగా వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజానికి దశ దిశ చూపిన మహర్షి వాల్మీకి మహా ముని అని కొనియాడారు. వాల్మీకి గొప్ప జ్ఞాన మహర్షి అయ్యారని.. పిల్లలను ఆ దిశగా ఎంత కష్టమైనా చదివించాలని కోరారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిందని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి: కిషన్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.