ETV Bharat / state

వాలంటైన్స్​ డే స్పెషల్​.. ఇదే నా మొదటి ప్రేమలేఖ - ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే

Valentines Day Special Love Letter: లేఖ.. ఇది ఒక లేఖ.. లేకలేక రాయలేక రాశాను ఓ లేఖ.. అదే నా ప్రేమలేఖ. రోజులు, నెలల తరబడి ఆలోచించి.. ఇష్టపడి రాసిన ఓ ప్రేమలేఖ. నా ప్రేమను అక్షరాలుగా మలిచి.. ఆమె మనసును గెలిచేందుకు రాసిన ప్రేమలేఖ. ఎన్ని ఏళ్లు గడిచినా మరవలేని లేఖ. వాలెంటైన్స్​ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్న నా ప్రేమలేఖ.

వాలెంటైన్స్​ డే స్పెషల్​.. ఇదే నా మొదటి ప్రేమలేఖ

author img

By

Published : Feb 14, 2023, 1:39 PM IST

Valentines Day Special Love Letter: ఎంతటి ధైర్యవంతుడైనా.. ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పేందుకు భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే.. చెప్తే ఎలాంటి సమాధానం వస్తుందోనని. ఒకవేళ నో చెప్తే తర్వాత పరిస్థితి ఏంటని. మనసులో మాట.. ఇష్టమైన అమ్మాయికి చెప్పేందుకు ఏళ్లు పడుతుంది. ఆ వెయిటింగ్​లో కూడా ఎంతో థ్రిల్​ ఉంటుంది. ప్రతిరోజు చెప్పాలనే ఉత్సాహం.. సమయం, సందర్బం రాక నిరుత్సాహం.. మళ్లీ తర్వాత రోజు అదే సీన్​ రిపీట్​.. తిరిగి చూసుకుంటే ఎన్నో నెలలు గడిచిపోతాయి.

ప్రేమికులిద్దరూ కళ్లతో రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయినా తనలో ప్రేమను వ్యక్తపరిచేందుకు రాత్రి, పగలూ తేడా లేకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. నిత్యం అదే ధ్యాసలో ఉంటాడు. తిండి తిప్పలు, నిద్ర మానేసి అమ్మాయికి తన ప్రేమ ఎలా వ్యక్తపరచాలో ఏకపాత్రాభినయం చేస్తూనే ఉంటాడు. అమ్మాయికి ప్రతిరోజు ఏదో విధంగా ఐ లవ్ ​యూ చెప్పాలనే ధైర్యం చేసినా.. చివరకు వెనకడుగు వేస్తూనే ఉంటాడు. అదంతా భయం కాదు.. తాను కాదంటే.. తన ప్రేమ ఎక్కడ ఓడిపోతుందోమోనన్న ఆందోళన. ఆ అలజడిని ప్రతి ప్రేమికుడు అనుభవించేదే. ఎలా చెప్పాలి.. ఏం చేయాలి అని రోజుల తరబడి ఫ్రెండ్స్​తో చర్చలు జరుపుతూనే ఉంటాడు. ఈరోజు ఎలాగైనా చెప్తానని ఛాలెంజ్​ చేస్తాడు. కానీ షరా మామూలే.

గతంలో తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులకు లేఖలు మాత్రమే ఉండేవి. ప్రేమికురాలికి ప్రేమలేఖ రాసేందుకు ప్రేమికుడు ఎంతో పరితపించేవాడు. ఇలాంటి ప్రేమలేఖ రాసేందుకు పరితపించినవాడిలో నేనూ ఒకడిని. ఎన్నో రాత్రులు ఆలోచించి.. ఎన్నో కాగితాలు పాడుచేసి.. చించేసి.. లేకలేక లేఖ రాసి ఎన్నో రోజులు జేబులో పెట్టుకుని తిరిగినవాడినే. ఆఖరికి ఆ లేఖ వాలెంటైన్స్​ డే నాడు అందించి విజయం సాధించినవాడినే. లోకం మరిచిపోయి ప్రేమలో విహరించినవాడినే. ఆ రోజులు గుర్తొస్తుంటే.. ప్రేమ ఎంతో మధురం.. అద్భుతం. ఆ క్షణాలు తలచుకుంటే ఏదో సాధించిన గర్వం. నా ప్రేమ నిత్యనూతనం.

ఇవీ చదవండి:

ప్రేమ.. 'బంధాలు, బాంధవ్యాలకు వారధి.. రెండు హృదయాల్లో సెలయేరులా పారేది'

ప్రేమికుల దినోత్సవం నాడు చేయకూడని పనులు ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.