ETV Bharat / state

'ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేవరకు పీఎస్​లోనే కూర్చుంటా'

దేశంలో 130 కోట్ల మంది ప్రజలు హిందువులేనని వ్యాఖ్యానించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అన్నందుకు కేసు నమోదు చేసి....క్షమాపణ చెప్పించారని... రాహుల్‌కు ఒక న్యాయం... మోహన్‌ భగవత్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

vh
రాహుల్​కు ఒక న్యాయం... మోహన్​ భగవత్​కు ఒక న్యాయమా?
author img

By

Published : Jan 6, 2020, 7:10 PM IST

భారతదేశంలో 130 కోట్లమంది హిందువులేనని ఎలా అంటారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. గత నెల 25న హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. భారతదేశం సెక్యులర్ దేశమని...అన్ని కులాలు, మతాల వారుంటారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మాటలను హనుమంతరావు గుర్తు చేశారు. వీటిలో ఏదినిజమో చెప్పాలని డిమాండ్​ చేశారు.

మోహన్​ భగవత్​పై.. తాను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో డిసెంబరు 30న ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదన్నారు. రేపు స్టేషన్​కు వెళ్లి ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేవరకూ ఠాణాలోనే కూర్చుంటానని స్పష్టం చేశారు.

రాహుల్​కు ఒక న్యాయం... మోహన్​ భగవత్​కు ఒక న్యాయమా?

ఇదీ చూడండి: 'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'

TG_Hyd_48_06_VH_ON_RSS_AB_3038066 Reporter: Tirupal Reddy Note: ఫీడ్ గాంధీభవన్‌ OFC నుంచి వచ్చింది. () దేశంలోని 130 కోట్ల మంది హిందువులేనని వ్యాఖ్యానించిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు డిమాండ్‌ చేశారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో మోహన్ భగవత్ మొత్తం భారత్‌లోని 130 కోట్లు జనాభా అంతా కూడా హిందువులని ఏలా అంటారని ఆయన నిలాదీశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మట్లాడుతూ భారత్‌ దేశం సెక్యూలెర్ దేశని...అన్ని కులాలు, మతాల వారుంటారని అన్న విషయాన్ని గుర్తు చేసిన హనుమంతురావు ఇందులో ఏది నిజమో...చెప్పాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌ రెడ్డి చెప్పినది నిజమైతే....మోమన్‌ భగవత్‌ మీద చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో డిసెంబరు 30వ తేదీన ఫిర్యాదు చేసినా... ఇంత వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చౌకిదర్ చోర్ అన్నందుకు కేసు నమోదు చేసి....క్షమాపణ చెప్పించారని..మరి మోహన్ భగవత్ పైన కేసు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. రాహుల్‌కు ఒక న్యాయం....మోహన్‌ భగవత్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బైట్: వి.హనుమంతురావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.