పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని.... మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ పురపాలక పరిధిలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. టికెట్టు ఎవరికి కేటాయించినప్పటికీ.... పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలందరూ... ఒకే తాటిపైకి రావాలని సూచించారు. నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్