రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు తుమ్మిడిహట్టి వద్ద గ్రావిటీ ద్వారా నీరొచ్చే ప్రాజెక్టు పనులు ఎందుకు చేయలేదని నిలదీస్తామన్నారు. నూతన వ్యవసాయ విధానం పూర్తిగా లోప భూయిష్టమైందని ఉత్తమ్ ఆరోపించారు.
"కాళేశ్వరం లిఫ్టునకు, మరో టీఎంసీకి రూ.21వేల కోట్ల టెండర్‌ను పిలిచారు. ఇంతకంటే తక్కువ ఖర్చులో తుమ్మిడి హట్టి వద్ద గ్రావిటీ ఫ్లో బ్యారేజీ పూర్తవుతుంది కదా. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం రోజున పెండిగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులం నిరసన తెలుపుతాం. కృష్ణా నదిపై పెండింగ్ పనులు ఎందుకు పూర్తి చేయలేదు. నూతన వ్యవసాయ విధానం లోపభూయిష్టమైంది."
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం