రాష్ట్రంలో యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడంపై ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వల్ల ఏడేళ్లలో ఏడువేల కోట్లు నష్టం వచ్చిందనడం సరికాదన్నారు. ఏడు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు బడ్జెట్‌లో ఏడువేలు కోట్లు ఎక్కువేం కాదన్నారు.రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న వారిని లుంబినీ పార్కు వద్ద అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఏఐసీసీ పిలుపు మేరకు దిల్లీలో రైతుల చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెగుతున్నాయని ఆరోపించారు. రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాజపా గతంలో ఎక్కడ ఉందో....ఇప్పుడు కూడా అక్కడే ఉంటుందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించటంతోపాటు కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్డేట్.. ఫొటో ట్వీట్