ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉత్తమ్​ లేఖ... అందులో ఏం రాశారంటే? - telangana news

ముఖ్యమంత్రి కేసీఆర్​కు పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.

Uttam kumar  Letter  To  Cm kcr
ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉత్తమ్​ లేఖ... అందులో ఏం రాశారంటే?
author img

By

Published : Aug 4, 2020, 9:53 PM IST

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కృష్ణానదిపై మొదలు పెట్టాలనుకున్న, ఇప్పుడున్న వాటిని విస్తరించాలనుకున్న ప్రాజెక్టులకు చెంది సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు రెండు లేఖలు రాసినా... సమాధానం ఇవ్వలేదని ఉత్తమ్‌ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు కృష్ణానదిపై నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేట్లు ఏపీ ప్రాజెక్టులను చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఈ ఏడాది మే 11న సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసిందన్నారు.

కానీ ఏపీ ప్రభుత్వం 203, 388 జీవోలు ఇచ్చి తద్వారా పనులు చేపట్టి, చట్టవిరుద్ధంగా కృష్ణ బేసిన్ నీటిని పెన్నార్ బేసిన్‌కు తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తక్షణమే సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. ఇది జరగనట్లయితే కృష్ణా పరీవాహక ప్రాంతంతోపాటు నాగర్జున సాగర్, కెఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐఎస్, దిండి, ఎస్‌ఎల్‌బీసీ, ఎఎమ్‌ఆర్‌పీ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి మహాబుబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఏడారిగా మారే ప్రమాదం ఉందని, హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరాపై కూడా ఆ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇంత ప్రధానమైన సమస్యపై చర్చించేందుకు కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ఏర్పాటు చేస్తున్న అపెక్స్‌ కమిటీ సమావేశానికి సీఎం హాజరై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రేపటి అపెక్స్‌ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా కొత్త సచివాలయ భవన రూపకల్పన కోసం క్యాబినెట్ ఏర్పాటు చేయడం హస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. క్యాబినెట్‌ సమావేశాన్ని ఇవాళకాని, ఎల్లుండికాని ఏర్పాటు చేసి రేపటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరవడం సాధ్యం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమై, ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లితే ఇందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.