త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 32 జిల్లాలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి సమన్వయకర్తలను నియమించారు. పీసీసీ కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులను సమన్వయకర్తలుగా నియమించారు. ఈ నెల 13,14,15 తేదీలలో మున్సిపాలిటీ పరిధిల్లో సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్ జిల్లా కోఆర్డినేటర్‌లను ఆదేశించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పురపోరు బరిలో ఉండే అభ్యర్థులను వార్డుల వారిగా సిఫారసు చేయాలని నేతలకు ఉత్తమ్ సూచించారు.
ఇవీ చూడండి: '2 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా?'