ETV Bharat / state

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్​ - quit india

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ విమర్శించారు. కరోనా కట్టడి విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 78వ క్విట్​ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా ఉత్తమ్​ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

utham comments on cm kcr
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్​
author img

By

Published : Aug 9, 2020, 12:44 PM IST

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ కీలకమైనదని, ఈ ఉద్యమమే స్వతంత్ర పోరాటానికి తీవ్ర స్థాయిలో బీజం వేసిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. 78వ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని పిలుపు నిచ్చారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం 5వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్ పెడితే కేసీఆర్ కేబినెట్ సమావేశం ఉందని... కమిటీ మీటింగ్ వాయిదా వేయడం అన్యాయమని అన్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జీహెచ్​ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోమవారం సిద్దిపేట, నాగర్​కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాలలో సంతాప సభలు నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూమ్ ఆప్ ద్వారా నందిఎల్లయ్య సంతాప సభ నిర్వహించనున్నామని తెలిపారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్​

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.