తెరాస ప్రభుత్వం కొండా విశ్వేశ్వరరెడ్డి పై రాజకీయ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విశ్వేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని... తప్పుడు కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి సివిల్ డ్రెస్‌లో పోలీసులు వచ్చి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ ధర్నా చేయటానికి ప్రయత్నిస్తే గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి ధ్వంసం చేయించి ప్రభుత్వం అవమానించిందన్నారు.
ఇవీ చూడండి: ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్‌వర్మ