ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఆర్ఎంవో రఫి వెల్లడించారు. ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆర్ఎంవో స్పష్టం చేశారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నోటినుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్ బీపీ లెవల్స్ బాగా పెరిగిపోయాయని చెప్పారు. సెలైన్స్, ఫ్లూయిడ్స్‌ను ఇద్దరికి ఎక్కిస్తున్నట్లు డాక్టర్ రఫీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం