ETV Bharat / state

కేటీఆర్‌తో యుఎస్ హ్యాండ్లూం రీసెర్చ్‌ స్కాలర్‌ భేటీ - US Handloom Research met ktr

US Handloom Research Scholar meets KTR తెలంగాణ చేనేత కళాఖండాలకు అమెరికాకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు అబ్బురపడ్డారు. తెలంగాణ మంత్రి కె.తారకరామారావుతో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు, చేనేత కళలపై సుదీర్ఘ పరిశోధనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కైరా మంత్రి కేటీఆర్‌ని కలిశారు.

US Handloom Research Scholar meets KTR
కేటీఆర్‌తో యుఎస్ హ్యాండ్లూం రీసెర్చ్‌ స్కాలర్‌ భేటీ
author img

By

Published : Dec 7, 2022, 8:56 PM IST

తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా జాప్ గాబ్రియేల్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా చేనేత అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో పర్యటించిన ఆమె... చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ను ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు.

US Handloom Research Scholar meets KTR
కేటీఆర్‌తో యుఎస్ హ్యాండ్లూం రీసెర్చ్‌ స్కాలర్‌ భేటీ

రాష్ట్రంలో తాను పర్యటించిన ప్రాంతాల్లో గుర్తించిన అనేక ముఖ్యమైన అంశాలను మంత్రితో పంచుకున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది దేశాల్లో పర్యటించినట్లు తెలిపిన కైరా... భారతదేశంలో మొదటగా తెలంగాణలోనే పర్యటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని చేనేత కళాకారులు తమ ఉత్పత్తులు, కళపట్ల అత్యంత గర్వంగా ఉన్నారని... ముఖ్యంగా చేసే పని పట్ల వారి నిబద్దత చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా కనిపించిందని గాబ్రియేల్ అన్నారు.

ఇతర దేశాలకు భిన్నంగా ఒకే చోట వందలాది మంది చేనేత కార్మికులు కలిసి పనిచేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్లు తాను గుర్తించానని తెలిపారు. తమ ఉత్పత్తులకు బ్రాండ్‌ను కల్పించడంతో పాటు మార్కెట్ విస్తృతికి ఇది ఎంతగానో దోహదపడుతోందన్న కైరా... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రోత్సాహకాల పట్ల కార్మికులకు ఉన్న అవగాహన ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎలాంటి పథకాలు అమలవుతున్నాయన్న అంశాలపై ప్రతి కార్మికుడికి పూర్తి సమాచారం, స్పష్టత ఉందని తెలిపారు. తాను పర్యటించిన తొమ్మిది దేశాల్లో చూడనంత గొప్ప కళా నైపుణ్యం ఇక్కడి చేనేత వస్త్రాల్లో ఉందని కైరా అబ్బురపడ్డారు.

చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన కైరా లాంటి పరిశోధకుల పక్షపాతం లేని అభిప్రాయాలు ఎంతో విలువైనవన్న ఆయన... పరిశ్రమ అభివృద్ధికి వారి నుంచి విలువైన సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఇతర దేశాల్లో చేనేత వస్త్ర పరిశ్రమ ఉన్నతికి అమలవుతున్న కార్యక్రమాల గురించి కూడా సమాచారం తీసుకుంటామని అన్నారు.

నేతన్నల కోసం తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్న కేటీఆర్... అందులో భాగంగానే ఆత్మహత్యల సంక్షోభం నుంచి నేతన్నల పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని వివరించారు. కైరా లాంటి విస్తృత అధ్యయనం చేసిన నిపుణులు, సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు. భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఇతర రాష్ట్రాల టెక్స్ టైల్ శాఖలతో సమన్వయం చేసే విషయంలో కైరాకు సాయం చేయాలని తెలంగాణ టెక్స్‌టైల్, చేనేతశాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఇవీ చూడండి:

చేనేత వస్త్రాలను ఆసక్తిగా తిలకించిన అమెరికా వాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.