హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ రంగానగర్‌లో ఉన్న బైబిల్ హౌస్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎట్టకేలకు ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌కు మారింది.
సుదీర్ఘకాలం కిందట రంగానగర్లోని ఓ ప్రైవేట్ భవనంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు ప్రభుత్వం ఈ భవనానికి అద్దె చెల్లించి.. తొమ్మిది నెలలుగా ఆపేసింది. ఆ కారణంగా సదరు భవన యజమాని ఆరోగ్య కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించుకోవాలన్నారు. గత నెల ఆరోగ్య కేంద్రానికి తాళం వేశారు.
తీవ్ర ఆందోళనకు గురైన ఆరోగ్య కేంద్ర సిబ్బంది.. సొంత భవనంలోకి తరలించే విషయాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేశారు. నెల రోజుల తర్వాత అధికారులు రంగంలోకి దిగి ఈ ఆరోగ్య కేంద్రాన్ని సమీపంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని బైబిల్ హౌస్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఇంఛార్జ్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యశ్రీ తెలిపారు.
ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత