తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నాగోల్లో ఉప్పల ఫౌండేషన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మాస్కులు, శానిటైజర్లను అందించారు.
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నంత వరకు వివిధ రకాల సేవలతో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.