కన్న కొడుకు కనిపించకుండా పోయాడని... పోలీస్ స్టేషన్‌కు వెళ్తే... పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్ ఉప్పల్ చిలకనగర్‌కు చెందిన బొంత యాదయ్య... తన కొడుకు సాయికిరణ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి... వెళ్లిన తమ కొడుకు ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతని స్నేహితులు, తెలిసిన వారిని అడిగిన ప్రయోజనం లేకపోవడం వల్ల ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కుమారుడు అదృశ్యమై 18 రోజులు గడుస్తున్నా... ఏ సమాచారం లభించలేదని ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే... నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వృద్ధాప్యంలో తమకు అండగా ఉండాల్సిన ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల అతనికి వివాహం కూడా అయిందని తమ కుమారుడి ఆచూకీ కనుక్కునే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వారు హెచ్ఆర్సీ ఛైర్మన్‌ను వేడుకున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ ఘర్షణల్లో 18కి చేరిన మృతుల సంఖ్య