TS Rains: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఆవర్తనం ఈరోజు కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోందని సంచాలకులు తెలిపారు. ఇది సగటు సముద్ర మట్టానికి నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉందని వివరించారు.
ఇవీ చదవండి: LEOPARDS VIDEO VIRAL : అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం
వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్లో విగతజీవిగా మరొకరు!