ETV Bharat / state

ఉపాధి వేతనం దక్కుతుంది అంతంతే.. - సొమ్ములు రాక ఇబ్బందలు పడుతున్న దినసరి కూలీలు

లాక్​డౌన్ కాలంలో చేసిన ఉపాధి హామీ పని కారణంగానైనా తమ కడుపులు నింపుకోవాలనుకున్నారు. కానీ కనీస వేతనం దక్కక కూలీలు ఆవేదన చెందుతున్నారు. పైగా సొమ్ముల పంపిణీలో జరిగే జాప్యం వల్ల మరింత కుంగిపోతున్నారు.

upadhi hamee workers problems in telanagana
ఉపాధి వేతనం అంతంతే
author img

By

Published : Jun 1, 2020, 6:03 AM IST

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి హామీ పథకం వరంగా పరిణమిస్తున్నా కనీస వేతనం దక్కక కూలీలు ఆవేదన చెందుతున్నారు. పైగా సొమ్ముల పంపిణీలో జాప్యం వారిని ఇబ్బంది పెడుతోంది. ఇతర పనులేవీ లేకపోవడంతో నిరుద్యోగులు, యువత, కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి పనులకు వస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం వర్షాలు కురవగా శనివారం వరకు అధిక ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లిపోయారు. తాము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదని కూలీలు వాపోతున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద నమోదైన తాజా గణాంకాల ప్రకారం ఈ పథకం కింద 23.74 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రోజుకు గరిష్ఠ వేతనం రూ.237గా నిర్దేశించగా రాష్ట్రంలో కూలీలకు అందుతున్న సగటువేతనం రూ.163 మాత్రమే.

మొన్నటి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న సగటు వేతనాల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో గరిష్ఠంగా రూ.228.75 మొత్తం నమోదైంది. ములుగు జిల్లాలో రూ.219.32గా ఉంది. 7 జిల్లాల పరిధిలో అందుతున్న సగటు వేతనం రూ.150 లోపే ఉంది. అతి తక్కువ సగటు జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.127గా ఉంది. ఖమ్మం రూ.134, మహబూబాబాద్‌ రూ.135, జనగామ రూ.138.55, వరంగల్‌ అర్బన్‌ రూ.141.14, నల్గొండ రూ.141.38, వరంగల్‌ గ్రామీణం రూ.148.06లో నమోదైంది.

గతేడాది కన్నా పెరిగిన కూలీలు

గతేడాదితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య సరాసరిన 9 లక్షలకు పైగా పెరిగింది. ఈ ఏడాది మే 23న అత్యధికంగా 11 లక్షల మంది కూలీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 540 మండలాల్లో కూలీల హాజరు భారీగా ఉంది. అత్యధికంగా కామారెడ్డి, అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాల నుంచి హాజరవుతున్నారు. మే నెల 23న కామారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 2,28,496 మంది పనులకు వచ్చారు. నల్గొండ 1,56,859 మంది, ఖమ్మం 1,36,881 మందితో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

సమస్యలివీ...

  • కొన్ని జిల్లాల్లో మూడు వారాలైనా వేతనం అందడం లేదు.
  • పనుల ప్రణాళిక సక్రమంగా లేకనే తక్కువ వేతనం వస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
  • రాష్ట్రంలో సమ్మె చేపట్టిన 7500 మంది క్షేత్రస్థాయి సహాయకులను విధులకు దూరంగా పెట్టారు. పనుల బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. వారు ఇతర విధుల్లో ఉండటంతో ఆ ప్రభావం ఉపాధి పనుల ప్రణాళికపై పడుతోందని కూలీలు చెబుతున్నారు.
  • పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు వెళ్లిన నిరుద్యోగులు, దినసరి కూలీలు వేతనాలు తక్కువగా అందుతున్నాయంటున్నారు.
  • పనులు చేసేచోట మౌలిక వసతులు ఉండటం లేదు. మూడేళ్ల క్రితం మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా కూలీలకు నీడనిచ్చే షెడ్లు సరఫరా చేశారు.

మొత్తం జాబ్‌కార్డులు: 52.27 లక్షలు
జాబ్‌కార్డుల్లో నమోదైన కూలీలు: 1.21 కోట్లు
ఈ ఏడాది ఇచ్చిన కొత్త జాబ్‌కార్డులు: 88,879
ఈ ఏడాది ఉపాధి పనులకు దరఖాస్తు చేసుకున్నవారు: 2.59 లక్షలు
రాష్ట్రంలో కూలీల సగటు వేతనం: రూ.163

upadhi hamee workers problems in telanagana
ఉపాధి వేతనం అంతంతే

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.