ETV Bharat / state

Dr Sharada Suman: పుట్టిన బిడ్డను చూసుకోకుండానే కరోనాతో పోరాడి ఓడిన వైద్యురాలు

విధి ఆడిన వింత ఆటలో ఆ వైద్యురాలు ఓడిపోయింది. కరోనా వేళ ఎంతో మందికి ఊపిరిపోసిన ఆమెను అదే మహమ్మారి పొట్టనబెట్టుకుంది. నవమాసాలు మోసిన కన్నబిడ్డను కళ్లారా చూసుకోకుండానే ఆ మాతృమూర్తిని ఈ లోకం నుంచి తీసుకెళ్లింది. భూమ్మిదకు వచ్చినప్పటి నుంచి తల్లి స్పర్శ కోసం పరితపిస్తోన్న నాలుగు నెలల పసికందు ఏడుపు ఇక అరణ్య రోదనే అయ్యింది.

Dr Sharada Suman died, Dr Sharada Suman dead after delivery
డాక్టర్ శారదా సుమన్ మృతి, బిడ్డకు జన్మనిచ్చి వైద్యురాలు మృతి
author img

By

Published : Sep 7, 2021, 2:29 PM IST

ఎంతోమందికి ప్రాణం పోసిన ఆ వైద్యురాలు... తనకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశారు. కరోనా(corona) మహమ్మారితో పోరాడి... విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయారు. కొవిడ్‌(covid) బారిన పడి ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు.. 140 రోజులు మృత్యువుతో పోరాడి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

నిండు గర్భిణీ... కరోనాతో పోరాడి..

యూపీకి చెందిన 32ఏళ్ల డాక్టర్‌ శారదా సుమన్‌(Dr Sharada Suman).. లఖ్‌నవూలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేసేవారు. భర్త అజయ్‌ కుమార్‌ కూడా వైద్యుడే. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ఆమె ఎంతోమంది కరోనా రోగులకు చికిత్స చేసి ఇళ్లకు పంపారు. వృత్తినే దైవంగా నమ్మే ఆమె.. నిండు గర్భిణీ అయినా జాగ్రత్తలు తీసుకుంటూనే రోగులకు సేవలందించి ప్రశంసలు పొందారు. ఇలా సాఫీగా సాగుతున్న ఆమె జీవితంపై కరోనా రక్కసి పగబట్టింది.

బిడ్డను చూసుకోలేదు

ఏప్రిల్‌ 14న శారద కొవిడ్‌ బారినపడ్డారు. అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి. వారం పాటు ఆరోగ్యం సవ్యంగానే ఉన్నా.. తర్వాత విషమించింది. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించారు. తర్వాత ఊపిరితిత్తుల్లో గడ్డలు(ఫైబ్రోసిస్‌) వచ్చినట్లు గుర్తించారు. మే 1న అత్యవసర శస్త్రచికిత్స చేసి పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే శారద ఆరోగ్యం విషమించడంతో ఎక్మో సాయంతో ఊపిరి అందించారు. కళ్లు తెరిచి బిడ్డను కళ్లారా చూసుకునే పరిస్థితిలో కూడా ఆమె లేదు.

140 రోజులు మృత్యువుతో పోరాటం

రోజురోజుకీ ఆమె పరిస్థితి క్షీణించడంతో వైద్యులు ఆమెకు ఊపిరితిత్తులు మార్చాలని నిర్ణయించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం జులై 11న ఎయిర్‌ అంబులెన్సులో లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు.

సమస్యలన్నీ ఏకమై..

ఊపిరితిత్తుల మార్పిడి కోసం అన్ని పరీక్షలు చేశారు. అయితే ఆమె శ్వాసనాళం, అన్నవాహికలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీని వల్ల నోటి ద్వారా ఆమెకు అందించే ఆహారం, ద్రవాలు నేరుగా ఊపిరితిత్తులకు వెళ్లిపోయాయి. దీని వల్ల ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ఆలస్యమవుతూ వచ్చింది. చికిత్సకు స్పందిస్తుందేమోనని వైద్యులు ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి డాక్టర్ శారద కన్నుమూసినట్లు కిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శారద కుమార్తె వయసు ఇప్పుడు నాలుగు నెలలు.

ఇదీ చదవండి: DOCTOR: కరోనా సమయంలో సేవలందించి... ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.