ETV Bharat / state

పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం... పక్కా వ్యూహంతో విజయం - Ghmc election results 2020

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తన స్థానాన్ని పదిలపర్చుకొంది. జీహెచ్ఎంసీ పాలకమండలిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎంఐఎం పక్కా వ్యూహంతో ఎన్నికల బరిలో నిలిచి తన స్థానాలు చేజారకుండా జాగ్రత్త పడింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో నుంచి 9 డివిజన్లలో తన అభ్యర్థులను నిలబెట్టకుండా అధికార పార్టీ తెరాసకు సహకరించిందనే అభిప్రాయం బలంగా ఉంది. సిట్టింగ్ స్థానాల్లో ఉన్నవారిపై ఉన్న అసంతృప్తి కారణంగా డివిజన్లను కోల్పోకుండా పలువురి డివిజన్లను మార్చడమే కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించి వ్యూహాత్మకంగా మరోసారి నగరపాలక మండలిలో కీలకంగా మారింది.

పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం... పక్కా వ్యూహంతో విజయం

author img

By

Published : Dec 5, 2020, 5:07 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పార్టీ ఎంఐఎం. గత ఎన్నికల్లో తెరాస- ఎంఐఎం కలిసి పోటీ చేయకపోయినప్పటికీ... అవగాహనతో వెళ్లాయి. ఈసారి కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయకుండానే... అదే అవగాహనతో ముందుకు వెళ్లింది. కీలకమైన డివిజన్లలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగడం వల్ల అనుకున్న స్థానాలను సాధించగలిగింది.

గత ఎన్నికల్లో ఎంఐఎం 60 స్థానాల్లో పోటీచేసి... 44 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి గతంతో పోలిస్తే మరిన్ని ఎక్కువ స్థానాలను సాధించాలని భావించినప్పటికీ చివరి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడి కేవలం పట్టు ఉన్న స్థానాల్లో మాత్రం పోటీ చేసింది. 60కు బదులు 51 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ చాలా చోట్ల భాజపాతోను మరికొన్ని స్థానాల్లో తెరాసతో పోటీ పడి విజయాన్ని సాధించింది.

కొత్తవారికి అవకాశం...

గతంతో పోలిస్తే సిట్టింగ్ స్థానాలను కోల్పోకుండా ఉండేందుకు 13 మంది సిట్టింగ్‌లను మార్చడమే కాకుండా మరో ఐదుగురు కొత్త వారికి అవకాశం కల్పించింది. జాంబాగ్‌ను ఎంఐఎం కోల్పోగా ఘాన్సీబజార్‌ స్థానంలో భాజపా అభ్యర్థిని ఓడించింది. సిట్టింగ్ స్థానం జంగమ్మెట్‌లో హోరాహోరీ పోటీ పడి చివరికి ఆ స్థానాన్ని పదిలం చేసుకొంది.

ఎన్నికల ప్రచారంలో ఓవైసీ సోదరులు తమదైనశైలిలో ఇటు రాష్ట్ర అటు కేంద్రప్రభుత్వాలపై విమర్శలు గుప్పించి ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేశారు. ఎంత మంది వచ్చి ప్రచారం చేసినా తమకు వచ్చే నష్టం ఏమి లేదని అసదుద్దీన్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఆచితూచి...

ఎంఐఎంకు పట్టున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా... రాజేంద్రనగర్, అంబర్​పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డ ఎంఐఎం... మేయర్ ఎన్నిక విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తోంది. తెరాస 55 స్థానాలను కైవసం చేసుకోగా మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ఎంఐఎం సహకారం తీసుకుంటుందా లేదా అన్న అంశంపై వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది.

తెరాసతో చేతులు కలిపే దిశగా...

శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం ఎక్కువగా సిట్టింగ్​లకే ప్రాధాన్యం ఇచ్చినా... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం సమర్థులైన అభ్యర్థులకే అవకాశం కల్పించి పాతబస్తీలో తన పట్టును నిలబెట్టుకోవడంలో ఎంఐఎం విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో తన సత్తా చాటిన ఎంఐఎం... అధికార తెరాసతో పాటు తనకు ముచ్చెమటలు పట్టించిన భాజపాను ఎదుర్కొనేందుకు తెరాసతో చేతులు కలిపే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇదీ చూడండి: మజ్లిస్ అడ్డపై ఎగిరిన కాషాయ జెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.