ETV Bharat / state

వ్యాయామం చేశాక ఈ హార్మోన్​ 12 శాతం పెరిగిందట!

వ్యాయామం చేస్తే శారీరకంగా దృఢంగా ఉంటామని అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండటానికి కారణాలు ఏమిటనేది ఎవరికీ సరిగా తెలియదు. వ్యాయామం చేసే సమయంలో శరీరంలో జరిగే మార్పులేంటనేది సదరన్​ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. అవేంటో చూద్దాం..

exercise
వ్యాయామం
author img

By

Published : Jan 31, 2021, 12:12 PM IST

Updated : Jan 31, 2021, 1:14 PM IST

వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండటానికి కారణం ఏమిటనేది సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అదేమంటే- వ్యాయామం చేసేటప్పుడు మోట్స్‌-సి అనే హార్మోన్‌ విడుదలవుతుందనే విషయాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. అయితే అది ఎందుకనేది అప్పట్లో తెలియలేదు. పైగా ఈ హార్మోన్‌ జన్యుసమాచారం శరీరంలోని ఇతర జన్యువులకన్నా భిన్నంగా ఉందనీ, వయసురీత్యా పనితీరు తగ్గిన మైటోకాండ్రియా కణాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుందనీ తాజాగా గుర్తించారు.

ఇందుకోసం వీళ్లు రోజూ వ్యాయామం చేసేవాళ్లను ఎంపికచేసి వ్యాయామానికి ముందూ తరవాత వాళ్ల శరీరంలో ఈ హార్మోన్‌ శాతాన్ని లెక్కించారట. వ్యాయామానికి ముందుకన్నా తరవాత ఈ హార్మోన్‌ శాతం 12 శాతం పెరిగిందట. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు ఎలుకలకు ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేయగా వృద్ధ దశలో ఉన్న ఎలుకలు సైతం చక్కగా ట్రెడ్‌మిల్‌ చేయడమే కాదు, బాగా నడవడం ప్రారంభించాయట. దీన్నిబట్టి వ్యాయామం చేసేవాళ్లు వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం ఈ హార్మోన్‌ విడుదల కావడమే అని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది?

Last Updated : Jan 31, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.