కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం సమావేశమయ్యారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో బోర్డుల పనితీరు సహా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలపై సమీక్షించారు.
బోర్డుల పరిధి, టెలిమెట్రీ, ప్రాజెక్టుల డీపీఆర్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం, గోదావరి జలాల మళ్లింపు సహా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు, పరస్పర ఫిర్యాదులపై శ్రీరాం ఆరా తీశారు. ఈ అంశాలన్నింటినీ కేంద్ర జలశక్తి మంత్రికి వివరించనున్నారు.
ఇవీచూడండి: ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్