రాష్ట్ర భాజపా కార్యాలయంలో కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. చేనేత సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత సంఘాల ప్రతినిధులు.. మంత్రికి వినతిపత్రం అందించారు. కరోనా సమయంలో తమ ఉపాధి పూర్తిగా కోల్పోయామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ