హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై సమీక్ష జరిగింది. సమావేశంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. మగ లేగ దూడలకు బదులు ఆడ దూడల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. తద్వారా పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ, సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం పురోగతిపై అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం సంచార వైద్యశాల, సంచార చేపల మార్కెట్, మత్స్యకారుల మోపెడ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు.
ఇవీ చూడండి: 'చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్‌పై ఆశలు గల్లంతు'