సమాజంలో పౌరులందరూ తోటివారి పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలతో మెలగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేట్ జీవనజ్యోతిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నేటి యువత క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు, జీవనజ్యోతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఎంతో మందిని చూశాం... కేసీఆర్‌లాంటి సీఎంను చూడలేదు'