Kishan Reddy fires on CM KCR : తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, తెరాసకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో ఫామ్‌హౌజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భాజపా కీలక నేతలైన అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్లపై కేసీఆర్ చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన ఖండించారు. కేసీఆర్ చూపించిన వీడియోలో ఉన్నవారితో.. భాజపాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
"అసలు ఆ వీడియోలో ఉన్న వారితో భాజపాకు సంబంధం లేదు. కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, తెరాసకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో పాత ముచ్చటను పదే పదే చెప్పారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు..: మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా తీవ్రంగా స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న విషయం తెలిసిన కేసీఆర్.. విలేకర్ల ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారని.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కొన్నది ఎవరని ప్రశ్నించారు. కేసులపై భయం లేనప్పుడు.. తెలంగాణలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె నిలదీశారు.
ఇవీ చూడండి..
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ.. ఎందుకంటే..?
'భాజపాకు ఓటు వేయలేదని ఎస్సీ బాలిక స్కూల్‌కు రాకుండా అడ్డగింత!'