గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళి అర్పించారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీతాఫల్‌మండి పాఠశాల విద్యార్థులకు పోషకాహార కిట్లు అందజేశారు.
గాంధీజీ స్ఫూర్తితో మోదీ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. గాంధీజీ కోరిన గ్రామస్వరాజ్యం కోసం మోదీ ఎన్నో పథకాలు తెచ్చారని పేర్కొన్నారు. మోదీ పాలనలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. కరోనా కష్టకాలంలోనూ దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం