ETV Bharat / state

తెలంగాణలో కల్వకుంట్ల అవినీతి పాలన సాగుతోంది: కిషన్‌రెడ్డి - kishan reddy in street corner meeting

తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని.. కల్వకుంట్ల అవినీతి పాలన యథేచ్ఛగా సాగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు రెండు పడక గదులు వచ్చే అవకాశమే లేదన్నారు. డబ్బులతో రాజకీయం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.

తెలంగాణలో కల్వకుంట్ల అవినీతి పాలన సాగుతోంది: కిషన్‌రెడ్డి

author img

By

Published : Feb 11, 2023, 5:03 PM IST

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్‌.. తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడ కూడలి వద్ద వీధి సమస్యల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజల సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకొని.. వారి ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు రెండు పడక గదులు వచ్చే అవకాశమే లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బులతో రాజకీయం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సికింద్రాబాద్‌లో సరైన రహదారులు, నీళ్లు, నియామకాలు, రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని.. కల్వకుంట్ల అవినీతి పాలన యథేచ్ఛగా సాగుతుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజానీకానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

''ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు రెండు పడక గదులు వచ్చే అవకాశమే లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. కల్వకుంట్ల అవినీతి పాలన యథేచ్ఛగా సాగుతుంది.'' - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

తెలంగాణలో కల్వకుంట్ల అవినీతి పాలన సాగుతోంది: కిషన్‌రెడ్డి

ఇవీ చూడండి..

'రిటైర్డు అయిన వారిని కొనసాగించడం ఎందుకు..?'

బుల్లెట్టు బండెక్కి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.