త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ భాజపా గెలవడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఖైరతాబాద్‌లోని సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పదవి చెప్పుతో పోల్చిన కేసీఆర్... రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అవమానించారన్నారు. తెరాస నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని... భాజపా పట్ల అనుకూలత పెరుగుతోందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మజ్లీస్‌తో పొత్తు లేదని చెప్పి... అదే పార్టీ సాయంతో మేయర్, ఉపమేయర్ పదవులు పొందారని విమర్శించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పాలనలో నిర్మించిన వాటికే కొత్త పేర్లు : భట్టి