ETV Bharat / state

'ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు.. ఏడాది పాటు వేడుకల నిర్వహణ'

author img

By

Published : Sep 5, 2022, 7:51 PM IST

kishan reddy on Telangana Liberation Day: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహ్వానాలు పంపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా విమోచన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

'ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు.. ఏడాది పాటు వేడుకల నిర్వహణ'
'ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు.. ఏడాది పాటు వేడుకల నిర్వహణ'
'ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు.. ఏడాది పాటు వేడుకల నిర్వహణ'

kishan reddy on Telangana Liberation Day: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. పరేడ్‌ మైదానంలో జరిగే ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ క్రమంలోనే 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోంమంత్రి హైదరాబాద్​లో కేంద్రప్రభుత్వం తరఫున జెండా ఎగురవేశారని.. 74 సంవత్సరాల తర్వాత నేటి హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తరఫున జెండా ఎగురవేయబోతున్నారని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా విమోచన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

ఈ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు ఆహ్వానాలు పంపినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. తెలంగాణ విమోచన దినాన్ని చేయాలని అడిగితే మజ్లిస్ పార్టీ వద్దంటోందని చెప్పారని ఆరోపించారు. పాత బురుజులకు రంగులు వేసి జెండాలు ఎగురవేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు విమోచన దినోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. పరేడ్‌ మైదానంలో జరిగే ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలు విమోచన దినోత్సవాల్లో పాల్గొనాలి. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ఇలా..: మరోవైపు తెలంగాణ సమాజం రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలను, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నగర, పురపాలక, పంచాయతీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత కథనాలు..

Telangana Liberation Day: ఒకే వేడుక.. కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా..

సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

ఇవీ చూడండి..

'ఈడీకి భయపడం.. రాష్ట్రంలో భాజపా ఆటలు సాగనివ్వం'

మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం.. కొన్ని గంటల తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.