Kishan Reddy On Lockdown: దేశంలో లాక్‌డౌన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌పై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్, ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదని స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కొవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. దేశంలో కొవిడ్ మూడోవేవ్ ప్రభావం పెరిగిందన్న కిషన్‌రెడ్డి.. కరోనా టీకా తీసుకున్న వారికి ముప్పు లేదని చెప్పారు. టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న యువత దేశంలో 8 కోట్ల మంది ఉన్నారని.. వారిలో ఇప్పటికే 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెప్పారు. దేశంలో 150 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైనా కొవిడ్ మెడిషన్, ఎక్విప్మెంట్ ఎగుమతులను నిలిపివేసినట్లు చెప్పారు.
'దేశంలో కొవిడ్ మూడోవేవ్ ప్రభావం పెరిగింది. కొవిడ్ టీకా తీసుకున్న వారికి ముప్పు లేదు. టీకాపై సామాజిక మాధ్యమాల్లోని పుకార్లు నమ్మొద్దు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించవచ్చు. సంక్రాంతి తర్వాత పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.'
- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
ఇదీచూడండి: కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తత అనివార్యం: పవన్ కల్యాణ్