ETV Bharat / state

అర్వింద్​పై దాడిని ఖండించిన అమిత్​షా.. నేరుగా ఆయనకే ఫోన్​..! - Dharmapuri Arvind latest news

జగిత్యాల జిల్లా ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని కేంద్రమంత్రి అమిత్​షా ఖండించారు. స్వయంగా అర్వింద్​కు ఫోన్​ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్లాన్​ ప్రకారమే తనపై దాడి చేశారని అర్వింద్​ అమిత్​ షాకు వివరించారు.

అర్వింద్​పై దాడిని ఖండించిన అమిత్​షా.. నేరుగా ఆయనకే ఫోన్​..!

author img

By

Published : Jul 15, 2022, 5:23 PM IST

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అర్వింద్​పై దాడిని ఆయన ఖండించారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అర్వింద్​ అమిత్ షా‌కు వివరించారు.

రాష్ట్రంలో భాజపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అధికార తెరాస పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అర్వింద్​ అమిత్​ షాకు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగినా తనపై దాడులు జరపాలని తెరాస నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అమిత్​షాకు తెలిపారు.

ఇదీ జరిగింది..

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్‌ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.

ఆ సమయంలో తమపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తిరుగు పయనమైన అర్వింద్‌ను మరోసారి వారు అడ్డుకున్నారు. గ్రామస్థులను పోలీసులు తప్పించి అర్వింద్‌ కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఇవీ చూడండి..

జగిత్యాల జిల్లాలో భాజపా ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్​పై దాడి

'కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? '

కొడుకు పుడితే నరబలి ఇస్తానని మొక్కులు.. 18 ఏళ్ల యువకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.