ETV Bharat / state

నేడు రాష్ట్ర బీజేపీ కీలక నేతలతో.. అమిత్‌షా భేటీ! అందుకోసమేనా..? - దిల్లీ

Telangana BJP Leaders In Delhi Today: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా.. దిల్లీ మద్యం కుంభకోణం వల్ల బీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

bjp
బీజేపీ
author img

By

Published : Feb 28, 2023, 7:08 AM IST

Updated : Feb 28, 2023, 3:35 PM IST

నేడు రాష్ట్ర బీజేపీ కీలక నేతలతో.. అమిత్‌షా భేటీ

Amit Shah Will Meet Leaders Of Telangana BJP National Working Committee: తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో కేంద్రమంత్రి అమిత్‌ షా నేడు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై అడిగి తెలుసుకోనున్నారు. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయని అధిష్ఠానం భావిస్తోంది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పోరాటం చేస్తూనే.. రాష్ట్రానికి ఏం చేస్తున్నామో.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు.

మార్చి నుంచి పోలీంగ్‌ బూత్‌ స్వశక్తికరణ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు దిల్లీకి రావాలని సూచించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షాతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, వివేక్‌, జితేందర్‌రెడ్డి భేటీలో పాల్గొనున్నారు.

బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. ఎన్నికలకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్‌ షా ఆరా తీయనున్నారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ వ్యూహాలకు ప్రతివ్యూహాలు, దిల్లీ మద్యం కుంభకోణం వల్ల ఆ పార్టీకి అనుకూల, ప్రతికూల పరిస్థితులేంటి, దీని వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల్లో సింపతీ పొందే అవకాశాలున్నాయా అనే అంశాలపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకు అనుగుణంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.

వీధి సభలను వదిలేసి దిల్లీకి పయనం: హస్తిన నుంచి ఆకస్మాత్తుగా రాష్ట్ర నేతలకు షా కార్యాలయం నుంచి దిల్లీకి రావాలని పిలుపురావడం పట్ల బీజేపీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. బీజేపీ తలపెట్టిన 11 వేల వీధి సభలు ఇవాళ్టితో ముగియనున్నాయి. వీధి సభల ముగింపు సందర్భంగా ఈ సభలను నిర్వహించాలనుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఆ సభలను సైతం వదిలేసి.. వెంటనే రావాలని ఆదేశించడంతో రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్రధాన అజెండా బీఆర్‌ఎస్‌నే: దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్తుందంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఒక వేళ కవితను అరెస్టు చేస్తే బీజేపీపైన ఎలాంటి ప్రభావం పడుతుంది. బీఆర్‌ఎస్‌కు సానుభూతి వస్తుందా..? అనే అంశాలపై.. ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ కవితను ఈ కేసులో అరెస్టు చేస్తే పార్టీకి నష్టం వాటిల్లకుండా.. బీఆర్‌ఎస్‌ చేసే విమర్శలను తిప్పికొట్టేలా అమిత్‌షా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 28, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.