Amit Shah visit to Telangana on March 12: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 12వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు కార్యక్రమాలు అనంతరం ఆయన.. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తగు ఏర్పాట్లు చేస్తోంది.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో అమిత్ షా పాల్గొంటారని.. ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో పాల్గొనే అంశంపై త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలోనూ అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు అమిత్ షా పర్యటన ఖరారు అయినప్పటికీ చివరి క్షణంలో ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ సారి ఆదిలాబాద్ లేదా మహబూబ్ నగర్ పార్లమెంట్‌లో ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిధిగా హాజరైన అమిత్ షా.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌లో సుమారు రెండు గంటల పాటు పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారంపై ఆరా తీశారు.
రాబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకత్వం తగు వ్యూహాలు రచిస్తోంది. ప్రతి నెల ఓ కేంద్ర మంత్రిని లేదా జాతీయ నాయకులను ఒక నియోజక వర్గానికి రప్పించి స్థానిక నాయకులతో చర్చలు జరపుతున్నారు. వివిధ కుల సంఘాల నేతలతో పార్టీ నాయకులు భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజక వర్గాల బలోపేతమే లక్ష్యంగా బీజేపీ తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బండి సంజయ్ నాయకత్వంలోనే ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండిసంజయ్ నాయకత్వంలోనే తెలంగాణ బీజేపీ ముందుకు వెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవరాహాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ గురువారం కీలక ప్రకటన విడుదల చేయడం ఆ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఇవీ చదవండి:
చంపుతామని మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడుగా బండి సంజయ్