బేగంపేట ప్రకాశ్‌నగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని కరీంనగర్‌కి చెందిన రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. రాజేశ్ ద్విచక్ర వాహనంపై పంజాగుట్ట వైపు వెళ్తున్న సమయంలో ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న మెట్రోపిల్లర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన రాజేశ్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ