హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో పోలీస్ కానిస్టేబుల్‌పై ఇద్దరు అగంతుకులు దాడి చేశారు. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రవీణ్ పై గుర్తు తెలియని యువకులు కర్రలతో కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ ఘటనా స్థలికి చేరుకుని విచారిస్తున్నారు. నిందుతుల కోసం సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి : కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు