ఓ పక్క వర్షం నీరు... మరో పక్క చేపల, రొయ్యలు కడిగిన నీరు... పోటెత్తిన కొనుగోలుదారులు.. భారీగా వచ్చిన అమ్మకందారులు.. వెరసి మురికి కూపానికి అడ్డాగా... కొవిడ్ మహమ్మారికి సింహద్వారంగా మారుతున్నాయి చేపల మార్కెట్లు. ఆదివారం వచ్చిందంటే చాలు ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్ కిటకిటలాడుతోంది. ఓ పక్క కొవిడ్ విజృంభిస్తోన్నా... అవేమీ తమకు పట్టనట్లు ప్రజలు పెద్దఎత్తున గుమిగూడుతూ మహమ్మారి వ్యాప్తికి కారకులవుతున్నారు.
అపరిశుభ్రానికి అడ్డాగా...
వర్షాలవల్ల డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతోంది. దానికి మార్కెట్లో చేపలు, రొయ్యలు కడిగిన నీరు కలిసి రోడ్లపైకి చేరుతుంది. రహదారులన్నీ బురదగా మారాయి. అక్కడే చేపల విక్రయం సాగిస్తున్నారు. ఈ మార్కెట్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్నా అభివృద్ధి విషయంలో అధికారులు పట్టనట్టే ఉంటున్నారు. దానికి తోడు మార్కెట్ చుట్టూ నూతనంగా నిర్మించడానికి తీసిన గోతుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చూడండి: ATTACK: కార్పొరేటర్ ఇంటిపై మేయర్ భర్త అనుచరుల దాడి