ETV Bharat / state

కరోనా వేళ చిల్డ్రన్‌ హెల్ప్‌డెస్క్‌కు అనూహ్య స్పందన - కరోనా వార్తలు

ఈ క్లిష్ట సమయంలో కొవిడ్‌ బాధిత కుటుంబాలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మహిళా శిశుసంక్షేమ శాఖ అండగా నిలుస్తోంది. తల్లిదండ్రులకు కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే.. పిల్లలను కంటికిరెప్పలా సాకుతున్నారు. కన్నవారు కోలుకుని వచ్చేంత వరకూ ప్రభుత్వ, ప్రయివేటు సంరక్షణ కేంద్రాల ద్వారా నీడ కల్పిస్తున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

unexpected-response-to-the-children's-helpdesk-during-corona
కరోనా వేళ చిల్డ్రన్‌ హెల్ప్‌డెస్క్‌కు అనూహ్య స్పందన
author img

By

Published : May 26, 2021, 11:43 AM IST

అమ్మానాన్న వస్తారని ఆశగా ఎదురుచూపులు. తలుపు చప్పుడైనప్పుడు గుమ్మం వైపు గమనించే పసికూనలు. ఆ చిన్నారులకు తెలియదు కనిపించకుండా పోయిన కన్నవారు.. ఇంకెన్నడూ కనిపించరని ఎవరూ ధైర్యం చేసి చెప్పలేరు. కరోనా కోరల్లో చిక్కి తల్లి/తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు సాయం కోసం దిక్కులు చూస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల పల్లెలు, పట్టణాలంటూ తేడాలేకుండా కొవిడ్‌ వందలాది మందిని బలి తీసుకుంటోంది. ఇంటికి ఆధారమైన వ్యక్తులు దూరమైన పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. కన్నవారిని కోల్పోయి, అయినవారి ఆప్యాయతకు నోచుకోలేని చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీన్ని అవకాశం చేసుకుని పిల్లల్ని దత్తత చేసుకుంటామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. సాయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న మాయగాళ్లు పేట్రేగిపోతున్నారు.

రెండేళ్ల క్రితం అమ్మదూరమైంది. ఇటీవల కరోనా మహమ్మారి తండ్రిని మింగేసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడు(14) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బంధువులు సాకేందుకు ముందుకు రాలేకపోయారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి మానవత్వంతో స్పందించారు. పిల్లాడి వివరాలు మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులకు చేరవేశాడు. మరుసటిరోజే ఉన్నతాధికారులు స్థానిక అంగన్వాడీ టీచర్‌ను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి భరోసా కల్పించారు. గురుకుల పాఠశాలలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- సంగారెడ్డి జిల్లాలో కన్నవారిని కోల్పోయిన బాలుడికి అందిన తోడ్పాటు

మేమున్నాం.. అక్కున చేర్చుకుంటాం

హైదరాబాద్‌ కేంద్రంగా చిల్డ్రన్‌ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. సహాయం కావాలంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌ను జిల్లా, మండల, గ్రామస్థాయిలోని సిబ్బందితో సమన్వయం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, ఇద్దరిలో ఏ ఒక్కర్నో కోల్పోయి నిస్సహాయంగా ఉన్న చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు చేర్చుతున్నారు. చదువుకు అవసరమైన సహకారం అందిస్తున్నారు. కన్నవారు దూరమై మనోవేదనతో బాధ పడుతున్న పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇస్తూ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనాథ అనే భావన పసి హృదయాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టంచేస్తున్నారు.

దత్తతకు ముందుకు

కొవిడ్‌తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకునేందుకు యువజంటలు ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/ఫోన్‌కాల్స్‌ ద్వారా తమ ఆసక్తిని పంచుకుంటున్నారు. దత్తత కోసం పిల్లలు కావాలంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. సహాయ కేంద్రానికి వస్తున్న ఫోన్‌కాల్స్‌లో పిల్లల ఆకలి తీర్చమంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. జిల్లా సంక్షేమశాఖ అధికారుల ద్వారా ఆయా కుటుంబాలు/వ్యక్తులకు సరకులు చేరవేస్తున్నారు. వైద్యసాయం కోసం వచ్చే ఫోన్‌కాల్స్‌ను సంబంధిత శాఖకు సిఫార్సు చేస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ఏప్రిల్‌ 19 నుంచి మే 19వ తేదీ వరకూ చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణ, వైద్యం, దత్తత అంశాలపై సహాయం కోరుతూ 500 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

చిన్నారుల కోసం ఫోన్‌కాల్స్‌

కొవిడ్‌ వైద్యసాయం -14, కొవిడ్‌ వల్ల అనాథలు-09, తల్లి/తండ్రి కోల్పోయిన చిన్నారులు - 22, అనాథలు - 13, చిన్నారులకు నిత్యావసర సరుకులు - 62, పిల్లలకు టీకా - 04, దత్తత స్వీకరణ - 56, చిన్నారులకు కొవిడ్‌ పరీక్షలు - 11, చిల్ట్రన్‌ కేర్‌ ఇనిస్టిట్యూట్స్‌(సీసీఐ) - 10, కుటుంబ పరమైన ఇబ్బందులు - 06, బాల్య వివాహాలు - 02, పోక్సో- 01

చిల్డ్రన్‌ హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు:

040 23733665, ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌: 1098

ఇదీ చూడండి: పేదరికంలోకి 24కోట్ల మంది- వెంటాడుతున్న ఆకలిమంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.