ETV Bharat / state

మూడు వారాల్లోనే ఒక శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

ఏప్రిల్​లో నిరుద్యోగులు మళ్లీ పెరిగారు. స్వల్ప లాక్​డౌన్​లు, కర్ఫ్యూలు విధించడంతో వీరి సంఖ్య మరీ పెరిగింది. జాతీయ స్థాయిలో మూడు వారాల క్రితం 6.65 శాతం నిరుద్యోగులు ఉండగా... ఏప్రిల్​ 18 నాటికి ఇది 8.40 శాతానికి పెరిగినట్లు భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది.

unemployment-rate-rises-by-one-percent-in-three-weeks
మూడు వారాల్లోనే ఒక శాతం పెరిగిన నిరుద్యోగ రేటు
author img

By

Published : Apr 23, 2021, 8:15 AM IST

కరోనా రెండో దశ ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండో దశ విరుచుకుపడుతుండటంతో నిరుద్యోగం మళ్లీ పెరుగుతోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ లేకున్నా కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో వైరస్‌ కట్టడికి రాత్రి కర్ఫ్యూ, ఆంక్షలు విధించారు. దీంతో వలస కార్మికులు, పట్టణ కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోతుండటంతో ఆ ప్రభావం పలు రంగాలపై పడుతోంది.

జాతీయస్థాయిలో గత మూడు వారాల్లో ఒక శాతానికి పైగా నిరుద్యోగ రేటు పెరిగినట్లు భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) అధ్యయనంలో తేలింది. మూడు వారాల క్రితం (మార్చి 28న) 6.65 శాతం ఉండగా.. ఏప్రిల్‌ 18 నాటికి ఇది 8.40 శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగ రేటు మూడు వారాల క్రితం 7.72 శాతం ఉండగా.. ఇప్పుడు 10.72 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.18 నుంచి 7.31 శాతానికి చేరింది. రాష్ట్రంలోనూ కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. నిర్మాణ రంగ పనులు నిలిచిపోతున్నాయి. మార్చిలో తెలంగాణలో నిరుద్యోగ రేటు 3.8 శాతం ఉండగా.. ప్రస్తుతం మరింత పెరుగుతోందని అంచనా.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి పకడ్బందీగా రాత్రి కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.