ETV Bharat / state

ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంగతేంటి: ఆర్​.కృష్ణయ్య

టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ ముట్టడించింది. ఫారెస్ట్‌ బీట్‌ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... ఆందోళన చేపట్టింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ సంగతి ఏంటని ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నవేశారు.

author img

By

Published : Mar 1, 2021, 6:27 PM IST

Unemployed JAC an obsessioned TSPSC office, hyderabad
ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంగతేంటి: ఆర్​.కృష్ణయ్య

ఉద్యోగాల భర్తీపై ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం... ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంగతేంటని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫలితాలను వెంటనే ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని... తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నాంపల్లి టీఎస్​పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీలను భర్తీ చేయకుండా తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను మభ్యపెడుతోందని విమర్శించారు.

రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్​పీఎస్సీ... ఫలితాలు విడుదల చేయకుండా... నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్‌ 2, ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.