UK MP Letter to CM KCR: డా.బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు భారత సంతతికి చెందిన యూకే ఎంపీ వీరేంద్ర శర్మ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రత్యేకంగా అంబేడ్కర్ మహా విగ్రహాన్ని నిర్మించి.. ఆవిష్కరించడం గొప్ప విషయమని లేఖలో కొనియాడారు. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని పేర్కొన్నారు. యూకేలోని సౌతాల్ ఈలింగ్ నుంచి పార్లమెంట్‌కు.. బ్రిటీష్ ఇండియన్ సంతతికి చెందిన 76 ఏళ్ల వీరేంద్ర శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
యూకే, భారత్‌లో ఆనాటి పరిస్థితుల్లో అంబేడ్కర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం పట్టుదల, ఆలోచనలు, కార్యాచరణ, విరామం ఎరుగని రచనా వ్యాసాంగం మహోన్నతమైనవని యూకే ఎంపీ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడిగా భారత దేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగాన్ని నిర్మించారని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం బీఆర్ అంబేడ్కర్ దార్శనికతను ఈ సమాజం ఇంకా అర్థం చేసుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూకేలోని తెలంగాణకు చెందిన సామాజిక సంస్థలతో కలిసి పని చేయడం గర్వంగా భావిస్తున్నానని లేఖలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే యూకేలో చూడాలనుకుంటున్నామని.. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని వినాలనుకుంటున్నట్లు వీరేంద్ర శర్మ లేఖలో స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో మహారాష్ట్ర నుంచి జోరుగా చేరికలు: ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు గులాబీ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంట నడవడానికి వచ్చిన వారికి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర ఎన్సీపీ కార్యదర్శి దినేశ్ బాబూరావు మడావి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన తండ్రి బాబురావు మడావి.. మూడుసార్లు ఎమ్మెల్యే, కాంగ్రెస్ హయాంలో సామాజిక, గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు.
Maharashtra Leaders Joined BRS: వీరితో పాటు గిరిజన హక్కుల సామాజిక కార్యకర్త బోళా శంభాజీ మడావి, పుణె జిల్లా ఎమ్ఎన్ఎస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ సురేశ్ పాటిల్, గోండ్వానా గణతంత్ర పార్టీకి చెందిన ప్రముఖ నేత, చంద్రపూర్ జిల్లాకు చెందిన నేత నామ్ దేవ్ ఆడే, బంజారా సమాజ్ లీడర్, అతుల్ సతీష్ రాథోడ్, దళిత సామాజిక నేత వీరేంద్ర పాటిల్... తదితరులు పార్టీలో చేరారు.
ఇవీ చదవండి: