హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. మార్చి 25వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 47 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ తెలిపారు.
హుండీ లెక్కింపులో భాగంగా 47 రోజులకు గాను రూ.8 లక్షల 85 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఆలయంలో భక్తులకు దర్శనానికి కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కుప్పకూలిన వాయుసేన విమానం- 12మంది మృతి